
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 15,పెద్ద శంకరంపేట మండలం, మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్)
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ భీ పడై భీ కార్యక్రమం సోమవారం పెద్ద శంకరంపేట లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారుఅంగన్వాడీ టీచర్స్ కు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నట్లు సిడిపిఓ పద్మలత తెలిపారుమాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్టు అల్లాదుర్గ్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల కు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని దీని ముఖ్య ఉద్దేశం అంగన్వాడి కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం విధులలో నైపుణ్యం పెంపొందించడం, నూతన విద్యా విధానం ప్రకారం సాక్ష్యం 2.0 కేంద్రాల నిర్వహణ తీరు పిల్లల పోషణ ఎదుగుదల సంరక్షణ తల్లిపాల లోపాలు వంటి విషయాలపై అంగన్వాడీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పుష్ప లత శ్రీశైల, భాగ్యమ్మ ఐసిడిఎస్ సిబ్బంది అన్నారం పాల్గొన్నారు