
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 24. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖలు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల నివేదికను అందించాలి ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి సంబంధించి వచ్చిన అర్జీలను పరిశీలన చేసి పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖలు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల నివేదికను మంగళవారం సాయంత్రం లోగా అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన షేక్ అసీఫ్, తన కుమారుడు షేక్ సూరజ్ ను శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో చేర్పించి అనారోగ్య కారణంగా ఒక రోజులోనే ఇంటికి తిరిగి తీసుకొని వచ్చామని, కళాశాల వారు ఒక్క రోజుకు 15,500 ఫీజు కట్ చేసుకున్నారని, తనకు తన డబ్బులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఇంటర్మీడియేట్ జిల్లా అధికారికి రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. మధిర ప్రాంతానికి చెందిన కాటారపు జయరాజు తన కుమార్తె ఇంటర్ చదువుతుందని జనన ధృవీకరణ పత్రం కోసం రెండు నెలల నుంచి తిరుగుతున్నానని, తన కుమార్తెకి త్వరగా బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కొర్సా ప్రభాకర్ తాము 1985 నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్నామని, 2022 లో తమకు మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఆర్వోఎఫ్ఆర్ సర్వే వచ్చిందని, పట్టాదారు పాసు పుస్తకం మాత్రం ఒక ఎకరం 6 గుంటలకు మాత్రమే వచ్చిందని, మిగిలిన రెండు ఎకరాల మూడు గంటల భూమికి ఆర్వోఎఫ్ఆర్ పట్టా పాస్ బుక్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ పెనుబల్లికి రాస్తూ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి ఏ. అరుణ, తదితరులు పాల్గొన్నారు.
