తాతయ్య పయనించే సూర్యుడు జనవరి 21 జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక విలియంపేట నందు ఈరోజు ఉదయం మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్రతో కలిసి, విలియం పేట నందు పర్యటించిన శ్రీరామ్ రాజగోపాల్ స్థానిక విలియంపేటలోని ఒక ప్రాంతంలో మంచినీటి సదుపాయం సరిగా రావట్లేదని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క ఇబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి మంచినీటి సదుపాయాలు పైప్లైన్ గమనించడం జరిగిందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మంచినీటి సదుపాయం బాగానే ఉందని ఎత్తు ప్రాంతంలో ఉన్న కొందరికి మంచినీరు సరిగా అందడం లేదని తెలియడం జరిగిందని వారికి మంచినీటి సదుపాయం పూర్తిస్థాయిలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని, జగ్గయ్యపేట పట్టణ ప్రజలందరికీ, ఇంటి ఇంటికి మంచినీరు సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పైపులైన్లు, పైపులైను మరమ్మత్తులు, హెడ్ వాటర్ వర్క్స్ లను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మున్సిపల్ సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
RELATED ARTICLES