
పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: వాతావరణ సమతుల్యతను కాపాచేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. 12వ వార్డు, 13 వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఈ సందర్భంగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు ప్రభు త్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొ క్కలు నాటుతామని తెలిపారు. ప్రతి ఒక్కరు త మ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షిం చాలని తెలిపారు. ఇల్లందులోని ఆయా శాఖలకు మొక్కలు నాటేందుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధం గా అధికారులు, సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డేనియల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మదుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాసరావు,నాయకులు పింగళి సరేష్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సుదర్శన్ కోరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు పెద్దినేని హరినాథ్ బాబు, రాకేష్, మహిళా నాయకులు మదుగు వెంకటలక్ష్మి బొందిలి విజయ, పెద్ద బోయిన శ్వేత, 12వ వార్డు ఆర్ పి హైమావతి, 13 వ వార్డు ఆర్ పి కృష్ణవేణ్, మెప్మా సిబ్బంది 12, 13వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.