Thursday, January 16, 2025
Homeతెలంగాణప్రపంచ భారత్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ప్రజా కవి

ప్రపంచ భారత్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ప్రజా కవి

Listen to this article
  • తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు,బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్. పయనించే సూర్యుడు : డిసెంబర్ 10 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకున్న ప్రజా కవి, తత్వవేత్త,ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్. హుజురాబాద్,కరీంనగర్ జిల్లాకు చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత, ప్రజా కవి,రచయిత,సామాజికవేత్త సాహితి వేత్త, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త,గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ సామాజిక,ఆధ్యాత్మిక,అత్యుత్తమ సేవలను అంతర్జాతీయ భారత వరల్డ్ రికార్డ్ కమిటీ సత్యం గౌడ్ సేవలను గుర్తించి, చతుష్టి కలలు సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా వీరిని ప్రపంచ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డుకు ఎంపిక చేసి, ఈ యొక్క అవార్డును హైదరాబాదులోని రవీంద్రభారతిలో గురువారం అంతర్జాతీయ భారత వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకులు కదిరి వెంకటరమణ రావు తో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి ఫార్మర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్టర్, చకిలం అసోసియేషన్ డైరెక్టర్ చెకిలం సుధాకర్, ప్రజాకవి తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్, ఇంటర్నేషనల్ ఫిలిం జూరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కమిటీ డాక్టర్ నాగులపల్లి పద్మిని, టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ బేబీ శ్రీదేవి సత్యం గౌడ్ కు పట్టు శాలువా కప్పి జ్ఞాపకం అందజేసి, మెడలో రికార్డు ఐ డి కార్డు ధరింపజేసి, జేబుకు భారత్ వరల్డ్ రికార్డ్ మోడల్ ధరింపజేసి, ప్రపంచభారత్ వరల్డ్ రికార్డ్ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారత్ వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకులు కదిరి వెంకటరమణ రావు తో పాటు ముఖ్య అతిధులు సముద్రాల వేణుగోపాల చారి, పద్మిని, చకిరం సుధాకర్ మాట్లాడుతూ సత్యం గౌడ్ సామాజిక ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని ముఖ్యంగా విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగాలని సంకల్పంతో సెమినార్లు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదగాలని కాంక్షిస్తూ సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయం అన్నారు. కవిగా రచనలు రాణిస్తూ ఆవిష్కరిస్తూ విలువలు పెంపొందించే రచనలు చేస్తూ సత్యం రచనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని బోధన చేస్తూ ఆధ్యాత్మిక గురువుగా ఎంతో ఆధ్యాత్మిక ధ్యానం కలిగిన సత్యం గౌడ్ బోధనలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రజాకవి రచయిత తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భవాని అలవర్చుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో జీవిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో దేశభక్తిలో ముందంజలో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని అన్నారు. ఎందరో నృత్య కళాకారులను కవులను కళాకారులను సామాజికవేత్తలను సమాజానికి ఉపయోగపడే విద్యావేత్తలను ప్రోత్సహిస్తూ కలనే వృత్తిగా దైవంగా భావిస్తూ ఎందరికో సత్కరాలు అవార్డులు వరాలు రికార్డు అవార్డులు అందజేస్తున్న అంతర్జాతీయ వరల్డ్ రికార్డు సంస్థ వ్యవస్థాపకులు కదరా వెంకటరమణ రావుకు అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు గురువులు, విద్యావేత్తలు డాక్టర్లు ప్రొఫెసర్ వివిధ సంస్థల డైరెక్టర్లు చైర్మన్లు డాక్టర్లు న్యాయవాదులు చిన్నారులు నృత్య కళాకారుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments