
_ భద్రాద్రి జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు
ముదిగొండ రాంబాబు డిమాండ్
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 12. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డ నరహరి. పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కమిటీ సమావేశం బుధవారం నాడు దురిశెట్టి నాగేశ్వరరావు రజక ఇంటి వద్ద పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల వెంకటేశ్వర్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలో సుమారు వెయ్యి రజక కుటుంబాలు పై ఉన్నవని వీటిలో సుమారు 300 కుటుంబాలు ఇస్త్రీ మీద ఆధారపడి ఉంటున్నాయని 200 కుటుంబాలు ఇండ్లలో చాకిరీ చేసుకుంటూ జీవిస్తున్నారని,రజకులు పట్నంలో అనేక రకాల సమస్యలతో సతమవు తవుతు న్నారని సంఘంగా పాల్వంచ కమిటీ వీరి సమస్య మీద పని చేయాలనుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.ఈ నెల 24-2-2025 సోమవారం ఉదయం 10 గంటలకి పాల్వంచ కలెక్టరేట్ హాజరుకావాలని గ్రీవెన్స్ లో డిమాండ్ చేయాలని దరఖాస్తు చేయాలని అన్నారు 1.ప్రతి ఇస్త్రీ చేసే రజ కుడికి ఇస్త్రీ స్థలం క్రమబద్ధీకరణ చేయాలని. 2.ఒక షెడ్డు నిర్మాణం చేపట్టే ఇవ్వాలని ఆ షెడ్ కు ఉచిత కరెంట్ మీటర్ కల్పించాలని. దూర ప్రాంతాల నుంచి బట్టలు తీసు కొచ్చు కోవటానికి ,TVS మోపెడ్ సౌకర్యాన్ని కల్పించాలని. పాల్వంచ ఒక పారిశ్రామిక ప్రాంతమని పరిశ్రమలో పనిచేసే వారికి ప్రభుత్వం ఏ విధంగా అయితే సౌకర్యాలు కల్పి స్తుం దో రజకులు చేసే పని కూడా ఆ పారిశ్రామిక లో పనిలో భాగమేనని, ఇక్కడ ఉన్నత అధికారులు గుర్తించాలని డిమాండ్ చేశారు . 6.అదే విధంగా పాల్వంచ పట్టణ రజకుల పై జరిగే దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలను, అకృత్యాల పై,, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని. పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వృత్తి పని చేసే ప్రతి రజ కుడికి 6 గ్యారంటీ లు పథకాలు ఎటువంటి షరతులు లేకుండా అవకాశం కల్పించాలి.8.50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధం గా ఈ నెలలో జరిగే కలెక్టరేట్ గ్రీవెన్స్ కి ఇస్త్రీ పనిచేసే రజకులు ఇండ్ల పని చేసే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇస్త్రీ చేసే స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తూ షెడ్లు నిర్మించాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రజక వృత్తిదాల సంఘం జిల్లా ట్రెజరర్ దురిశెట్టి నాగేశ్వరరావు రామ తులసి శ్రావణి హరినాథ్ , రమేష్, తదితరులు పాల్గొన్నారు.