
వైసిపి సీనియర్ నాయకుడు గోరంట్ల జడ్పిటిసి పాలే జయరాం నాయక్
పయనించే సూర్యుడు జనవరి 29 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా
గుంతకల్లు టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్టులపై మాట్లాడుతూ నాపై తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాల మీద పడేస్తా అని బెదిరించడం దురదృష్టకరమని వైసిపి సీనియర్ నాయకుడు గోరంట్ల మండల జడ్పిటిసి పాలే జయరాం నాయక్ మండిపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి అనుభవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టిడిపి తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేగా అయ్యి పదవి అహంకారంతో జర్నలిస్టులపై ఇలా మాట్లాడడం సబబు కాదని వార్తలను తప్పుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప జర్నలిస్టులను రైలు పట్టాలపై పడేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యంలో మీడియాను పాత్రికేయ సమాజాన్ని మీడియాను పాత్రికేయ సమాజాన్ని భయపెట్టడా లని చూడడం దుర్మార్గం నిజాన్ని నిర్భయంగా రాసే పాత్రికేయులను ఒక ఎమ్మెల్యే బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదని పాలన చేతకాని వాళ్లే ఇలా బెదిరింపులకు పాల్పడతారని నిజాలు బయటపడతాయని భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటివి మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్షమాపణ చెప్పాలని వైసీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల మండల జడ్పిటిసి పాలే జయరాం నాయక్ డిమాండ్ చేశారు