పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృద్వి
సెలవుల సమయంలో మహిళా టీచర్లను, ఉపాధ్యాయులను స్కూలుకు హాజరు కావాలని ఆదేశిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందుసంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఖాతారు చేయకుండా తమ ఇష్టానుసారంగా సెలవులు ప్రకటించుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సెలవులు ప్రకటించి ప్రైవేట్ ఉపాధ్యాయులను స్కూలుకు హాజరుకావాలని లేకుంటే మీ జీతభత్యాలలో కోత విధించడం జరుగుతుందని ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేసి సెలవుల సమయంలో కూడా విద్యాసంస్థలలో ఎట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను స్కూలుకు హాజరు కావాలనే ఆంక్షలతో మహిళా టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఎందుకంటే విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో వారి పిల్లలు ఇంటి దగ్గర ఉండి మహిళా ఉపాధ్యాయులు స్కూలుకు హాజరు కావడంతో వారు చిన్న పిల్లలు కావడం, ఒంటరిగా ఇంటిదగ్గర ఉండడం వారిని చూసుకునేవారు ఎవరు లేక వారికి ఏం జరుగుతుందో తెలియని భయాందోళనతో మహిళా ఉపాధ్యాయునీలు భయం భయంతో పాఠశాలకు హాజరవుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించినా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా నామమాత్రంగా తమ విధులు నిర్వహిస్తున్నారంటే అధికారులకి, యాజమాన్యాలకు మధ్య ఎలాంటి ఒప్పందాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వారు అన్నారు. ఇంత నిర్భయంగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి విద్యార్థులకు ఆటంకంతో పాటు ఉపాధ్యాయులను సైతం ఇబ్బందులకు గురి చేసే వారి వైఖరి పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అనుసరించే విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ అన్నారు