
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 15 అల్లూరి
సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్ధులను ఉద్దేశించి ఉపన్యసించారు. స్వాతంత్రోద్యమ స్పూర్తితో దేశ భక్తిని పెంపొందించుకుని, క్రమశిక్షణ తో మెలగాలని ఆయన పేర్కొన్నారు. దేశరక్షణకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టే విద్యాభివృద్ధికి ఆపరేషన్ మార్చి ( పబ్లిక్ పరీక్షలపై దృష్టి ) చేపట్టి విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించాలని ఉద్బోధించారు. నేటి విద్యార్థులే రేపటి నూతన ఆవిష్కర్తలు కావాలని ప్రిన్సిపాల్ రమేష్ బాబు అభిలషించారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్ధినివిద్యార్దులు పాల్గొన్నారు.