
కుంజా శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 15
ఎటపాక మండలం గుండాల ఇసుక ర్యాంపు నుండి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతా ఉంటే, మరోపక్క ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు పట్టుబడుతున్న కఠిన చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం మరియు అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలియజేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ప్రకటన ద్వారా అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కట్టుదిట్టమైన భద్ర చర్యల మధ్య నడవాల్సినటువంటి ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటం పట్ల అధికారుల ప్రజాప్రతినిధుల హస్తం ఉన్న విషయం బహిరంగ రహస్యమేనని దొరికిన వాళ్ళు దొంగ అవుతున్నారు దొరకని వాళ్ళు దొరలు గా దోచుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇసుక ర్యాంపులు డంపింగ్ యార్డ్ నుండి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా చేస్తూ ఒక ట్రిప్పు చలానాకు మూడు ట్రక్కుల ఇసుక బయటకు వెళ్తుందని ఇదంతా కూడా అధికారులు ఆదినాల్లోనే జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇసుక ర్యాంపు, డంపింగ్ యార్డ్, ఇసుక తరలింపు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు నిత్యం రికార్డు అవుతూ ఉండాలని కానీ గుండాల ఇసుక ర్యాంపు యందు ఏ రకమైనటువంటి సీసీ కెమెరాలు లేకపోవడం చూస్తా ఉంటే అధికారులు అక్రమాలను ఎలా ప్రోత్సహిస్తున్నారానేది అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఒక ఇద్దరి ఇసుక కాంట్రాక్టర్ దారులు మైనింగ్ డిపార్ట్మెంట్ ని ఇటు రెవిన్యూ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తూ ఈ దందా అంత కొనసాగిస్తున్నట్లు తెలుస్తుందని, ఇసుక ర్యాంపు నుండి తక్కువ రేటుకు డిడి కట్టి భారీ ఎత్తున ఇసుక వేరే ప్రాంతాలకు తరలించి వేరే వేరే ప్రాంతాలలో ఇసుక డంపింగ్ యార్డ్ లు పెట్టి వేల రూపాయలకు అమ్మటం జరుగుతుందని ఆయన అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే దశల వారి ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు