Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Listen to this article

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

మక్తల్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి.

{పయనించే సూర్యుడు} {అక్టోబర్18}మక్తల్

తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన విద్య,మెరుగైన వైద్యం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకి సన్నబియ్యం,నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లను రాజకీయాలకు అతీతంగా మంజూరు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్లక్రమంలో భాగంగా శుక్రవారం మక్తల్ మండల పరిధిలోని సంగం బండ ( దివంగత చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ తో పాటు మక్తల్ పట్టణంలోని పెద్ద చెరువు మిని ట్యాంక్ బండ్ లో చేప పిల్లలను మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తో కలిసి విడుదల చేశారు. తరువాత రూ.377 లక్షల వ్యయంతో మక్తల్ మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేసి వన మహోత్సవంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ,వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో 100 శాతం రాయితీతో 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేపపిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను “ఉచితంగా పంపిణీ” చేస్తున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో తనకు అవినాభావ సంబంధం ఉందని, తమ ప్రాంతాలు సంగారెడ్డి, జోగిపేట, సదాశివ పేట లలో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు చాలా ఉన్నారన్నారు. బీసీ సమాజంలో నాయకత్వం ఎదగాలని, తద్వారా వెనకబడ్డ కులాలకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందుతుందన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల 30 ఏళ్ల పోరాటానికి చరమగీతం పడి వారి వర్గీకరణ కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. బీసీ సమాజంలో నూటికి నూరు శాతం కమిట్మెంట్ ఉన్న నాయకుడు వాకిటి శ్రీహరి అని ముదిరాజ్ కులంలో పుట్టిన శ్రీహరి ఆ జాతికే గర్వకారణం అని కొనియాడారు. గతంలో ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా తన శాఖకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇక పై ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందని, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని, అలాంటి బ్లాక్ పాయింట్ల వద్ద ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని,ఈ ఏడాదిలో డిసెంబర్లో ట్రామా సెంటర్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు 6 నెలల్లో మహబూబ్ నగర్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్, ఎం ఆర్ ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.నారాయణపేట లో 50 సీట్లతో ఇప్పటికే మెడికల్ కాలేజీ అందుబాటులోకి తీసుకొని వచ్చామని, మరో 9 నెలల్లోచికిత్స కోసం హైదరాబాద్ వరకు వెళ్లకుండా గ్రామాల్లోనే చికిత్సా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…. బీద బడుగు బలహీనర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. పక్కన కృష్ణమ్మ పారుతున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మక్తల్ ప్రాంతానికి నీళ్లు రాలేదనీ, కాంట్రాక్టర్లను బతికించడానికే గత పాలకులు ప్రాజెక్టులు తెచ్చారని ఎద్దేవా చేశారు. గత పాలకుల మాటలే తప్ప చేతలు లేవు అన్నారు.గత పాలకులు మైక్ పట్టుకున్న ప్రతిసారి జీవో 69,14 అని కాగితాలు చూపించి మాత్రమే కాలం గడిపారు తప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేదనీ ద్వజమెత్తారు. ఈ ప్రాంతం వెనుబాటు తనానికి గురి అయిందని గుర్తించి , జీవో నెం 69,14 ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని నారాయణపేట- మక్తల్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కృషి చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చివరి అవకాశం కింద నీళ్లు ఇస్తాం జీవో ఇచ్చి కాన్సల్ చేసిందన్నారు. ఈ సందర్బంగా మనం సత్యసాయిబాబా ను గుర్తు చేసుకోవాలని 75 గ్రామాలకు నీరు అందిస్తూ పైపు లైన్ వేస్తే …..అలా కాదు మేము ఎక్కువ చదివాం మాకు ఎక్కువ తెలుసని,కాంట్రాక్టర్ల కోసం పక్కనే ఉన్న ప్రాజెక్టు మూసివేసి ఇక్కడ ఉన్న నీళ్లను శ్రీశైలం దగ్గర ఏలూరు బ్యాక్ వాటర్ కి తరలించి అక్కడినుండి నాగర్ కర్నూలు టు జడ్చర్ల టు మరికల్ నుండి నారాయణ పేట,మక్తల్ కి నీళ్లు ఇచ్చే పరిస్థితి దాపురించిందని, ఎక్కడ ఏ చిన్న పైపు పగిలినా నీటి సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణమ్మ నీళ్లు ఇస్తుంటే 330 కిలోమీటర్ల దూరం టెలర్స్ పెట్టడం జరిగిందనీ,కాంట్రాక్టర్లను బతికించడానికే గత పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. పాలమూరు – రంగారెడ్డి కాలువల నీళ్లు ఇస్తాం అని కథలు చెప్పారు తప్ప ప్రాజెక్టు పూర్తి చేయకపోగా,నారాయణపేట – మక్తల్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వారిని బి.ఆర్.ఎస్. నాయకులు రెచ్చగొడుతున్నారు.భూ సేకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ఎకరానికి 14 లక్షలు ఉంటే 20 లక్షలు పెంచి ఇచ్చామని తెలిపారు.ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురి కాకుండా మళ్ళీ ఒక భూత్పూర్, నేరెడ్ గాం కాకుండా 94% రైతులు స్వచ్చందంగా ఈ ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.ఏదైనా శాఖకు మార్చిలో బడ్జెట్ కేటాయిస్తే మళ్ళీ మార్చిలోనే బడ్జెట్ పెంచుతారు కానీ తాను మధ్యలో మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 123 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు.ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మత్స్య శాఖ కేటాయించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. గతంలో చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయనీ, తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మత్స్య శాఖను ప్రక్షాళన చేశానని చెప్పారు. అన్ని చెరువుల దగ్గర చేప గుర్తు వున్న బోర్డు ఏర్పాటు చేసి అందులో చేప రకం,ఎన్ని చేపలు వదిలాం,సంఘం అధ్యక్షుడు పేరు, ఎస్ ఐ పేరు ఫోన్ నెంబర్ తో కూడిన వివరాలు ఉంటాయన్నారు. ఈరోజు ప్రారంభం చేసిన చేపల పంపిణీ ద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని, ఈ ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 255 నీటి వనరులు ఉన్నాయని వాటిలో 94 లక్షల చేప పిల్లలను వదలడం జరుగుతుందని, దీనివల్ల 46 మత్స్య సహకార సంఘాలలోని 4500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. మక్తల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ బ్యూటీఫికేషన్ పనులు దాదాపుగా 4 కోట్లతో ప్రారంభించామని, ఈ పనులు కూడ అడ్డుకోవడానికి బి.ఆర్.ఎస్ నాయకులు ప్రయత్నం చేశారనీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సుందరీ కరణ పనులను పూర్తి చేసి తీరుతాం అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నసరే చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చారని, ఇది వరకే మక్తల్ నియోజకవర్గానికి 2 ఆసుపత్రులు ఆత్మకూరు 22 కోట్లతో నిర్మాణం,మక్తల్ ప్రాంతంలో 42 కోట్లతో నిర్మాణం,2 డయాలసిస్ సెంటర్లు,5.అంబులెన్స్ లు ,అమరచింత, మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి 23 మంది వైద్య శాఖ స్టాఫ్ ను మంత్రి దామోదర రాజనర్సింహ కేటాయించారని గుర్తు చేశారు. మన ప్రాంతానికి నిధులు కేటాయించడంలో చొరవ చూపిస్తున్న దామోదర రాజనర్సింహ మన జిల్లాకు ఇన్చార్జి రావడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఎమ్మెల్యేలు డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి, మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, జిల్లా మత్స్యశాఖ చైర్మన్ కాంత్ కుమార్, మత్స్యశాఖ జిల్లా అధికారి రహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments