
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 21:-రిపోర్టర్( కే శివకృష్ణ) విజయలక్ష్మి పురం లో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ జిల్లా బ్రాంచ్ కార్యాలయాన్ని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గరికపాటి ప్రభాకర్ రావు గురువారము ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అని, జిల్లాలో ఉన్న హోటల్స్,రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరణా దుకాణాలు, మాంసం
వి క్రియ దుకాణాలు, స్వీట్ షాపులు వారు శిక్షణ తీసుకొని సర్టిఫికేషన్ పొందాలని కోరారు. బిజినెస్ డెవలప్మెంట్ కస్టమర్లకు క్వాలిటీ మరియు హెల్త్ ఫుడ్ ఇవ్వగలిగే కెపాసిటీని పెంపొందించటమే FoSTac ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. జిల్లా అధికారి దేవరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఫుడ్ మేకర్ శిక్షణ తీసుకోవాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ మాట్లాడుతూ FoSTac శిక్షణ పొందడం వలన ఆహార సంబంధిత వ్యాధులనుంచి మనుషులను కాపాడుకుంటూ, కల్తీ ఆహారాన్ని గుర్తించటం, శుభ్రత పరిశుభ్రత నైపుణ్యాన్ని తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ కలకండ ప్రవీణ్ కుమార్, బాపట్ల బ్రాంచ్ మేనేజర్ నవీన్, కిరణా అసోసియేషన్ సెక్రెటరీ దిలీప్, ఫ్యాన్సీ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మువ్వ శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.