
టేకులపల్లిలో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన పార్టీ శ్రేణులు
పయనించే సూర్యుడు ఆగస్టు 16 పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి : భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీస్వార్థ ప్రజా సేవకుడు కామ్రేడ్ బోల్లోజు అయోధ్య చారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించిన టేకులపల్లి మండల పార్టీ కార్యవర్గం… సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు. రామ్ చందర్. టేకులపల్లి మండల కేంద్రంలోని సిపిఐ ఆఫీస్ నందు మండల కార్యవర్గ సమావేశం ఎజ్జు భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు గూగులోతు రామ్ చందర్ మాట్లాడుతూ కామ్రేడ్ ఆయోధ్య సిపిఐ టేకులపల్లి మండల పార్టీ ఘన నివాళి ప్రగాఢ సంతాపం. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య చారి ఆగస్టు 6 న వారు యాక్సిడెంట్ సూర్యాపేటలో మరణించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు ఆయన ఎక్కడ ఉన్న ఆత్మ శాంతి చేకూరాలని ఆయన ఆశయ సాధన కోసం ఐక్యమత్యంతో పార్టీని ముందుకు నడిపించాలని తెలిపారు. ఆగస్టు 17న . ఆదివారం రోజు మణుగూరు కిన్నెర కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సంతాప సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజా సంఘా లు సానుభూతిపరులు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని హాజరవాలని కోరారు భారత కమ్యూనిస్టు సిపిఐ తెలంగాణలో పార్టీ నిర్మాణంలో ఒకరైన అయోధ్య ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులతో ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి అయిత శ్రీరాములు భాస్కర్ గుగులోతు శ్రీను బానోతు వీరన్న తేజావత్ మధు ఇస్లావత్ రవీందర్ సతీష్ గుగులోతు సోనీ తదితరులు పాల్గొన్నారు