
//పయనించే సూర్యుడు// న్యూస్// ఆగస్టు21//
బుధవారం ఉదయం 10:00 ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కార్యాలయంలో మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నారాయణ గురుజి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ జుట్ల నరేందర్ గారు-BSP తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశిష్ట అతిథి గా బండారి చంద్రశేఖ ర్ గారు -BSP నారాయణపేట జిల్లా కార్యదర్శ మరియు బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ పాల్గొన్నారు ఈ సందర్బంగా కార్యక్రమనీ ఉద్దేశించి కె వి నరసింహ మాట్లాడుతూ నారాయణ గురూజీ చేసిన సేవలను కొనియాడుతూ మందుగా నారాయణ గురూజీ చిత్ర పటానికి పూల మాల ఎస్తూ అయన చేసిన సేవలను కొనియాడారు కేరళ రాష్ట్రంలో అక్షరాష్యత పెరగడానికి ముందుగా దేవాలయాలను సైతం పాఠశాలలుగా మారచిన ఘనత నారాయణ గురూజీది అని అయన కొనియాడారు జుట్ల నరేందర్ మాట్లాడుతూ కులమతాలకు కచ్చితంగా ప్రతి ఒక్కరిని సమానత్వం చూడడంలో నారాయణ గురు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిని కొనియాడారు చంద్రశేఖర్ మాట్లాడుతూ అనధికాలంగా వస్తున్న బహుజన జాతులపై అణచివేతను నారాయణ గురూజీ పోరాటాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు పాలెం వెంకటయ్య మాట్లాడుతూ నారాయణ గురుజి లాంటి వాళ్ళని బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు మరవదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ నారాయణ గురుజి చిత్రపటానికి పూలమాలలు సమర్పిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోమీడియా మిత్రులు మరియు మక్తల్ అసెంబ్లీ నాయకులు పరిషరాం మాలరెడ్డి మక్తల్ మండల అధ్యక్షులు జె భేమేష్ వెంకటేష్ ఉషాప్పతదితరులు పాల్గొన్నారు
