
రుద్రూర్, అక్టోబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వివేక్ కుమార్, చింతల లింగమ్మ, నెమ్లి గంగాధర్ లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం ఎస్సై సాయన్న బాధితులకు అప్పగించారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.