
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 బాల్కొండ ప్రతినిధి కే లింబాద్రి
భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన ఏగోళం గంగాధర్ గౌడ్ ఇటీవల గల్ఫ్ దేశం దుబాయిలో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చి ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు