
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు..
డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి…
త్రిబుల్ రైడింగ్ మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు
పట్టణ సీఐ రాంబాబు .
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 8:- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. పట్టణ సీఐ రాంబాబు అన్నారు. బాపట్ల పట్టణం లో పాత బస్టాండ్ నందు శనివారం వాహన తనిఖీ నిర్వహించారు.. బాపట్ల జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఎవరు గాయపడకూడదని సంకల్పంతో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పట్టణ సీఐ రాంబాబు తెలిపారు…