
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: అడిషనల్ ఎస్పీ
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 2:-రిపోర్టర్ (కే శివకృష్ణ) పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసినారు. విధులలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు సూచించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ శనివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి అన్నారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఏటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాలలోకి పంపడం జరిగిందన్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఇతర నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. పరీక్షా కేంద్రాలకు చుట్టుపక్కల ఉండే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ లను పరీక్షలు జరిగే సమయంలో మూసివేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
