
హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ తోపాటు ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ వంట గదిని పరీక్షించారు
పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ మంచాల మండల పరిధి నోముల గ్రామం లోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ , కాలేజ్ హాస్టల్ ని హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ సమక్షంలో హాస్టల్ ని సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్నారు.ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి రక్షణ లేకుండా ఉన్న ప్రహరీ గోడ , కనీసం డోర్లు కూడా లేకుండా విద్యార్థుల సామాన్లకు జాగ్రత్త లేకుండా ఉందని తెలియజేశారు . మరుగుదొడ్లులో వాటర్ ట్యాప్ లలో వాటర్ కూడా లేక పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని తెలుసుకున్నారు.హాస్టల్ బిల్డింగ్ పాతబడి తరగతి గదులలో శుభ్రంగా లేకుండా వంట గదులు అంతంత మాత్రమే ఉందని తెలుసుకున్నారు.ఈ సమస్యలపై ప్రిన్సిపాల్ ని అడగగా ఎనిమిది నెలల నుండి రెంటు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మేము చేసే ప్రయత్నం చాలావరకు మా సొంత ఖర్చుతో చేస్తున్నామని వివరించారు.ఈ విషయంపై ఉన్నతాధికారులను దృష్టికి తీసుకెళ్తానని హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహ, టీచర్స్ ప్రవీణ్, భరత్, అనిత, సంగీత తదితరులు పాల్గొన్నారు
