పయనించే సూర్యుడు స్టేట్ ఇంచార్జ్ అనిల్ కుమార్
చిత్తూరు జిల్లా: జనవరి 10 :
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇవ్వడంపై వైసీపీ మాజీ మంత్రి రోజా అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నా రని, ఆమె ప్రశ్నించారు.
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కో కుండా నీతి మాలిన రాజకీ యాలు చేస్తున్నారని మండి పడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు..
భక్తులకు సర్వీస్ చేయా లన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తుల ను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.
భక్తులకు కనీస సదుపా యాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. తెలంగాణలో చూసాం.. ఓ ఘటనలో మహిళ చనిపో తే అల్లు అర్జున్ పై కేసు పెట్టారు.. ఈ ఘటనలో చంద్రబాబు నుంచి క్రింది స్థాయి అధికారులు బాధ్య త వహించాలి.. ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కేసులు నమోదు చేశారు..
విజయవాడ హైందవ శంఖారావంలో చెప్పారు.. హిందువులను కాపాడాలని చెప్పారు.. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యా రు.. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని మాట్లాడారో అందరూ చూశారు.. మీరు చేస్తే కరెక్టు.. మరొకరు చేస్తే తప్పు అన్నట్లు చేస్తున్నా రు.. ప్రధాని మోడీకి ఒకటే విజ్ఞాపన చేస్తున్నా.. బాధ్యు లను కఠినంగా శిక్షించాలి..
సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా?.. మీరు చేస్తారా..? హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదు.. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపల వేయాలన్నారు…
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అస మర్దత వల్లే ఇంతమంది చనిపోయారు. కారకులైన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని రోజా ప్రశ్నించారు.