
పయనించే సూర్యుడు జులై 03 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: మండలం పెగళ్ళపాడు పడమటిగుంపు గ్రామానికి చెందిన జోగా వీరభద్రం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేంధర్ అశ్వారావుపేట మాజీ MLA తాటి వెంకటేశ్వర్లు భౌతిక దేహానికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు ఆర్ధిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్,పోశాలు ,వీరభద్రం, సంజయ్,G.V రాజు , సర్వయ్య , బన్సీ లాల్,వెంకట్,గోవర్ధన్, సుదీప్,హనుమంతు,రవి శంకర్, వంశీ, , ప్రసాద్,రమేష్ రామారావు, కాంతారావు ,నారాయణ, నరేష్, సీతయ్యా, భరత్,బాబు, సత్తిపండు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.