

పయనించే సూర్యుడు ఆగస్ట్ 25 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) ఎంతోమంది అనాధలకు వృద్ధులకు చిన్న పిల్లలకు అమ్మగా నేనున్నానంటూ ఆశ్రమం కల్పించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న శ్రీ మంజుల ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు మంజులమ్మ కుమారుడు డాక్టరేట్ అవార్డు గ్రహీత శ్రావణ్ మరో అడుగు ముందుకు వేసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైదేహి సూపర్ స్పెషయాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సంయుక్త నిర్వహణ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ట్రస్ట్ ఆవరణలో ని ఆరోగ్య సౌకర్యాలు అందించేందుకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ శిబిరంలో ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, గుండె పరీక్షలు అవసరమైన చికిత్స మరియు సలహాలు అందించబడ్డాయి..చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేయబడింది. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వైద్యులు ప్రత్యేకంగా మార్గదర్శనం చేశారు.ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు మరియు సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో సుమారు 100 మంది రోగ పీడుతులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు…ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించేందుకు వైదేహి సుపర్ స్పెషయాలిటీ ఆసుపత్రి బెంగళూరు వారు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు…ఈ కార్యక్రమంలో మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మంజులమ్మ, వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్ సభ్యులు, డాక్టర్ శ్రావణ్ కుమార్, నేషనల్ మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, బిసి ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, ట్రస్ట్ ప్రచార కార్యదర్శి సంపంగి గోవర్ధన్, బత్తల శ్రీనివాసులు, అమడగూరు గాయత్రి, ట్రస్ట్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.