
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలంలో ఏ.సీ.ఏ, షాలేం, మరనాత, సిఎస్ఐ, ఆర్.సి.యం చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకను ఘనంగా నిర్వహించారు.
సులానగర్ ఆర్.సి.యం చర్చి లో పరిశుద్ధ సిలువ మార్గం 14 స్థలాలలో యేసు క్రీస్తు వేషధారణలతో కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ప్రదర్శనలు చేపట్టారు.
ఆర్.సి.యం చర్చ్ ఫాదర్ మార్నేని అర్లయ్య, దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ఈ సందర్భంగా ఫాదర్ మార్నేని అర్లయ్య వాక్యాన్ని బోధిస్తూ ప్రభువు చెప్పినట్టుగా మనకు మనం తగ్గించుకుంటామో వారి జీవితాలు బాగుపడతాయి, మానవాళి పాప పరిహారార్థమై ఏసుప్రభు సిలువ మీద మరణించారు అనీ ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేశారు.వాక్య సందేశాలను దేవాలయంలో పాల్గొన్న క్రైస్తవ భక్తులకు ఫాదర్ బోధించారు అనంతరం 4O రోజులు ఉపవాసం ఉన్న క్రైస్తవులు శుక్రవారం నుండి ఉపవాసాన్ని విరవింప చేశారు. ఈ కార్యక్రమంలో కొయగూడెం,ముత్యాలంపాడు ముత్యాలంపాడు క్రాస్ రోడ్, సులానగర్ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు ఉండేటి బసవయ్య, అంతోటి నాగేశ్వరరావు, ఉండేటి ఇర్మియ, కర్లపూడి సామ్యూల్, కొప్పుల నాగేశ్వరరావు, చింతమల్ల రాములు, కర్లపూడి బాబురావు, సంఘస్తులు పాల్గొన్నారు.