
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 10 మామిడిపెల్లి లక్ష్మణ్
ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా రాయికల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడి,ఐకెపి, మహిళ పంచాయితీ కార్యదర్శులు,కారో బార్లు, మహిళా సంఘ సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి తహసిల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం,మండల పంచాయతీ అధికారి సుష్మ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ గణేష్, ఏఈ ప్రసాద్, ఏపీఎం శ్రీనివాస్ చక్రవర్తి, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.