
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఎమ్మార్వో సతీష్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు
భూ నిర్వాసితుల జిల్లా నాయకులు పుంజునూరు ఆంజనేయులు గోవింద్ రాజ్
//పయనించే సూర్యుడు// జులై 27//
మక్తల్ మండలంలోని కాట్రేపల్లి హెర్ నాగన్ పల్లి కాచువార్ గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ తాసిల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భూ నిర్వాసితుల జిల్లా నాయకులు పుంజునూరు ఆంజనేయులు గోవింద్ రాజ్ మాట్లాడుతూ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ధర 50 లక్షల నుండి కోటి వరకు ఒక ఎకరంకు కొంటున్న పరిస్థితి ఉన్నది దీనికి విరుద్ధంగా ప్రభుత్వం 14 లక్షలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో అన్నారు. 2013 భూ చట్టం ప్రకారము న్యాయమైన పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. బలవంతంగా భూసేకరణ ఆపాలి, ఈ కార్యక్రమంలో కేశవులు, రవీందర్ రెడ్డి, రాజు, రవికుమార్, నరసప్ప, శ్రీశైలం, వెంకటప్ప, బీరప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు
