
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ 19 తేదీ ఏప్రిల్
జ్యోతిరావు పూలే బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ* మక్తల్ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పై ఈ మధ్యకాలంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు తెరవెనుక నాయకులు లేఖల రూపంలో ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం సరైనది కాదు. ఆయన అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని క్రింది స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక బహుజన బిడ్డ రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే రాజకీయంగా ముందుకు పోకుండా అధిష్టానం దృష్టిలో చెడ్డవాడిగా చిత్రీకరించాలని చేస్తున్నటువంటి మేధావులు తెరవెనక నాయకులు ఒకసారి ఆలోచించాలి. కౌన్సిలర్ గా జడ్పిటిసి గా,మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నేడు శాసనసభ్యుడిగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. అలాగే తనకు మంత్రి పదవి వస్తుందనే అక్కసుతో తెర వెనుక నాయకులు ఇతర పార్టీల నాయకులు మంత్రి పదవి రాకుండా ఉండాలని అధిష్టానానికి చెడ్డవాడిగా చూపించాలని లేఖల రూపంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమాత్రం ప్రభావం చూపవు.ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు మక్తల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని 24 గంటలు కష్టపడుతున్న ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. మక్తల్ పట్టణంలో సూర్య జ్యోతి కాటన్ మిల్ ఉన్నప్పుడు నిత్యం వందల మంది పనిచేస్తూ జీవనాధారం సాగించేవారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సూర్య జ్యోతి కాటన్ మిల్ మూతబడి నేడు ఎంతోమంది సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. అలాగే సంఘం బండ కాలువ దగ్గర అడ్డుగా ఉన్నటువంటి బండరాయి తొలగింపు కోసం మంత్రుల చుట్టూ తిరిగి వాళ్ళని మెప్పించి కష్టపడి ఆ యొక్క బండ రాయిని తొలగించి సంఘం బండ రిజర్వాయర్ నీళ్లపై ఆధారపడిన రైతులకు మేలు చేయడం జరిగింది. మరియు సంఘం బండ రిజర్వాయర్ బాధితులకు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న నిధులను కూడా తీసుకురావడం జరిగింది. నారాయణపేట నుంచి మక్తల్ కు వచ్చే ఫిట్ నెస్ లేని బస్సుల గురించి శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో ఈ అంశాన్ని బలంగా తీసుకువెళ్లి మక్తల్ కు నేడు మంచి ఫిట్ నెస్ ఉన్న బస్సులను తీసుకురావడంలో కూడా ఎంతో కృషి దాగి ఉంది. గతంలో డయాలసిస్ బాధితులు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. ఈరోజు తెర వెనుక ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు గాని వ్యక్తులు గాని వీటన్నిటి పైన గత పాలకులను ఎందుకు ప్రశ్నించలేదు మరి ఈరోజు ఒక బహుజన బిడ్డ రాజకీయంగా ముందుకు వెళుతుంటే ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయనకు అధిష్టానం అండగా ఉంటుంది మరియు ఆయనకు ఖచ్చితంగా మంత్రిమండలిలో చోటు కల్పించి మంత్రి పదవులు వరిస్తాయి.ఈ యొక్క విష సంస్కృతిని జ్యోతిరావు పూలే బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ తెర వెనుక రాసినటువంటి లేఖల పై పోలీసు శాఖ వారు కూడా స్పందించి విచారణ చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కచ్చితంగా న్యాయ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతలి ఆంజనేయులు,టి నరేష్ ,మంగలి రవి, మహమ్మద్ నాసిర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.