పయనించే సూర్యుడు జనవరి13 మక్తల్ రిపోర్టర్ ( సీ తిమ్మప్ప)
.మక్తల్ నియోజకవర్గ ప్రజలకు కౌన్సిలర్ గొల్లపల్లి శంకరమ్మ నారాయణ ..భోగి, మకర సంక్రాంతి.శుభాకాంక్షలు తెలిపారు.భోగి పండుగ సందర్భంగా వేసే భోగి మంటలు అందరి జీవితాల్లో భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని ప్రజల జీవితాలలో ఈ సంక్రాంతి పండగ సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే ఈ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో ప్రతి ఇంట పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని సూచించారు. పండగ పూట పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని గుర్తు చేశారు. ప్రతి రైతు కుటుంబం ఆనందంగా గడుపుతారని రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి, సన్న వడ్ల కి 500 బోనస్ రైతు భరోసా 12 వేలకు పెంచడం. ఇందిరమ్మ ఆత్మీయ కానుక ద్వారా భూమిలేని వ్యవసాయ కూలీలకు 12 వేల ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక. ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని. మక్తల్ కౌన్సిలర్ గొల్లపల్లి శంకరమ్మ నారాయణ.పేర్కొన్నారు.