
{పయనించే సూర్యుడు} {అక్టోబర్19}మక్తల్
స్థానిక మక్తల్ పట్టణం మున్సిపాలిటీ రెండోవాడు దండు గ్రామం శివాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్ సమావేశము నిర్వహించడం జరిగింది. మొదట పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమ అని, విశ్వజన సంక్షేమమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని అన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, మతమార్పిడుల నిరోధం, లవ్ జిహాద్, ధ్యేయంగా హిందూ ధర్మ పరిరక్షణకు కంకణ బద్దులై పనిచేయాలని సూచించారు.అనంతరం బజరంగ్ దళ్ దండు గ్రామం నూతన కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.దండు గ్రామం నూతన కమిటీ (1) దండు గ్రామం సంయోజక్ గా – శంకర్(2) దండు గ్రామం సాహ సంయోజక్ గా – రాఘవేంద్ర(3) గ్రామ గోరక్ష సంయోజక్ గా – వంశీ(4) గ్రామ విద్యార్థి సంయోజక్ గా- హేమంత్ (5) గ్రామ సురక్ష సంయోజక్ గా- బసవరాజ్(6) గ్రామ బలోపాసన గా- లక్ష్మీనారాయణ 7 గ్రామ సాప్తాయిక్ మిలన్ సంయోజక్ గా- ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి ఎన్నికలు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ నారాయణపేట జిల్లా సహ సంయోజక్ పసుపుల భీమేష్, ప్రఖండ సహా మూర్తి, మండల సంయోజక్ రామాంజనేయులు, శంకర్, అక్షయ్,శ్రీను, మార్గదర్శకత్వంలో జరిగింది. ఎన్నికైన నూతన సభ్యులకు దండు ప్రముఖులు మరియు పట్టణ ప్రజలు శుభాభినందనలు తెలియజేయడం జరిగింది.