
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొని జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ సామాజిక వ్యవస్థ, సామాజిక సమానత్వం మహిళా సాధికారత విద్య తదితర అంశాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ వేముల మహేష్ కలిగినీడి ప్రసాద్ గుణశేఖర్ పాదం సూర్య, కళ్యాణ్ రణదీప్ మరియు వీర మహిళ అనిత గాలి తదితరులు పాల్గొన్నారు.