
మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్
పయనించే సూర్యుడు మార్చి 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులైన ఆర్టీసీ డిపో మేనేజర్ కరీమున్నీసా, పట్టణ వైద్యురాలు ఆస్మా, ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ కమేశ్వరి మరియు పట్టణ మహిళా ప్రముఖులు మరియు ఆత్మకూరు సిఐ గంగాధర్, సంగం సిఐ వేమారెడ్డి, ఆత్మకూరు ఎస్ఐలు జిలాని, సాయి ప్రసాద్, పోలీస్ స్టేషన్ . సచివాలయ మహిళా పోలీసులుపాల్గొన్నారు.ఈ కార్యక్రమం సందర్భంగా మహిళల చేత భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం మహిళ ప్రాముఖ్యత గురించి సభలో పాల్గొన్న అందరూ ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మహిళా ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా సంతరించుకుందని మహిళలు ఎదిగేందుకు ఎన్నో ప్రోత్సహకాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు.మహిళా పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించి బహుమతులు అందించారు. కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్టేషన్ నందు భోజనాలు భోజన సదుపాయం నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
