

- మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి వెంకటరెడ్డి గారి వర్థంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కామేపల్లి మండలం కోత్త లింగాల క్రాస్ రోడ్డు వద్ద మాజీ మంత్రి వర్యులు, పాలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ రాంరెడ్డి వెంకటరెడ్డి గారి 9వ వర్థంతి సందర్భంగా వారి విగ్రహానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాహితం కోసం రాంరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన సేవలు చిరస్థాయిలో నిలిచిపోతాయని అన్నారు వెంకటరెడ్డి సూచించిన దారిలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు ఆయన చేపట్టిన పదవికి వెన్నె తెచ్చారని కోనియాడారు.. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, రైతు కుటుంబం నుంచి వచ్చి రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
పయనించే సూర్యుడు. మార్చి 5. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్