
- మార్కెట్ లో జరుగుతున్న కొనుగోళ్ల జాప్యం పై ఆగ్రహం
- మిర్చిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు అదేశాలు
- ఖమ్మం మిర్చి యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పయనించే సూర్యుడు. మార్చి 05. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- ఖమ్మం నాణ్యమైన మిర్చికి ధర తగ్గించి, మిర్చి కొనుగోలు విషయమై రైతులను ట్రేడర్లు మోసం చేస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. న్న నేపథ్యంలో మిర్చి మార్కెట్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిర్చి యార్డును కళియతిరిగి కొనుగోళ్ళను పరిశీలించారు. గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు కలెక్టర్ సూచించారు. తేమశాతం కోసం మిరపకాయలు పట్టుకుని నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, సరుకు బాగానే ఉన్నా తక్కువ ధర చెల్లిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్కు వచ్చిన కలెక్టర్ తో మిర్చి రైతులు, మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. జెండా పాటకు వేలం వ్యత్యాసంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో చాలా నష్టాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్ వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని, అన్నదాతలకు వెంటనే చెల్లింపులు చేయాలని వ్యాపారులకు అన్నారు. మిర్చి పంట కొనుగోళ్లు సాగుతున్న తీరుపై, జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు పొంతన లేదని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. నాణ్యత పేరుతో రైతులను ఖరీదుదారులు నష్ట పరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వారి లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి బస్తా కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యపరిచారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు ఏవరు చేసిన ఉపేక్షించబోమని అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగేలా అధికారులు వారికి అండగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మం మార్కెట్ లో రైతులకు గిట్టుబాటు ధర అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. వ్యాపార లావాదేవీలను, సరుకు నాణ్యతను మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఇతర శాఖలను సమన్వయం చేసుకుని, రైతుకు సరైన ధర లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అధికారులు, తదితరులు ఉన్నారు.
