
రిపోర్టర్ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు..
జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభినందనలు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ రిపోర్టర్ గా శ్రీనివాస్ మీడియా రంగంలో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. స్థానిక స్టూడియో 18 రిపోర్టర్ శ్రీనివాస్ జన్మదినాన్నీ పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్, పలువురు జర్నలిస్టులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రతి జర్నలిస్టు చిత్తశుద్ధితో పనిచేసి సమాజాన్ని ప్రగతి వైపు నడిపించాలని అన్నారు. జర్నలిస్ట్ కేపీ మాట్లాడుతూ శ్రీనివాస్ జర్నలిస్టుగా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తో పాటు స్థానిక జర్నలిస్టులు కస్తూరి రంగనాథ్, టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు రఘు, జిల్లా నాయకులు నరసింహారెడ్డి, సీనియర్ పాత్రికేయులు సంజయ్ కుమార్, సరాపురమేష్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, చౌదరి గూడెం మండల పార్టీ అధ్యక్షులు రాజు, నందిగామ అధ్యక్షులు జంగా నరసింహ యాదవ్, బాలరాజు గౌడ్, వీర్లపల్లి హుస్సేన్, చంద్రపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
