పయనించే సూర్యుడు జనవరి 13 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
సంక్రాంతి
పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నందు యూత్ కాంగ్రెస్ & కాలనీవాసులు యువకుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్అధ్యక్షులు సాయి రెడ్డి తెలిపారు.
మొదటి బహుమతిగా రంగం నరసింహ్మ, రెండవ బహుమతిగా రాజేష్, మూడవ బహుమతిగా “జై కిసాన్ ఫర్టిలైజ్”, స్పాన్సర్స్ గా ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సహక బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి “జ్యోతి శరణ్య,” మహిళా గెలుచుకోగా,
రెండవ బహుమతి “గాయత్రి, లక్ష్మి”
మూడవ బహుమతి “సింధూర, సిరి”
నల్గొవ బహుమతి “సంధ్య, సరిత” ముగ్గుల పోటీలో బహుమతులు గెలుచుకున్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు యాదవ్, నర్సింహ్మ,గోపాల్, కాలనీ యువత పాల్గొన్నారు.