
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 యడ్లపాడు మండల ప్రతినిధి…
ఎడ్లపాడు మండలం, బోయపాలెం గ్రామంలో సంగం గోపాలపురం కు చెందిన వెల్పూరి శ్రీనాధ్ తేదీ 14.09.2025న సాయంత్రం 4:00 గంటల సమయంలో
మద్యం సేవిస్తుండగా అక్కడే ఉన్న సంగం గోపాలపురం కు చెందిన తన భార్య అక్క కొడుకైన పోట్లూరి విష్ణు తో మాట మాట పెరిగి గొడవ జరిగింది.ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన మల్లవరపు చందు మణికంఠ,రావురి విజయ్ కూడా వచ్చి,ముగ్గురు కలసి శ్రీనాధ్‌ను చేతులు,కాళ్లతో తీవ్రంగా కొట్టారు. అనంతరం శ్రీనాధ్ ఇంటికి వెళ్లి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు.కుటుంబ సభ్యులు అతనిని ఎడ్లపాడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడినుంచి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించి అతను మరణించాడని ప్రకటించారు.మృతుని అన్న సాంబయ్య ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.