పయనించే సూర్యుడు ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తోరూర్ డివిజన్ కేంద్రం
స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.తొర్రూరు పట్టణంలో స్థానిక వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈసందర్బంగా బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త వివేకానంద అని కొనియాడారు.భారత సాంస్కృతిక వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయడంతో ఆయన నిరంతరం కృషి చేశారు అని తెలిపారు.1893 చికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో హిందుత్వాన్ని,భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఆయన చేసిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది అని తెలిపారు.యువత చేతిలోనే ధేశ భవిష్యత్తు ఉందని,యువతే దేశాభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం యువతను ప్రోత్సాహించి స్వాతంత్ర్య సమరం లో యువత ముందుండి పోరాడేలా ప్రేరణ అందించాడని, ఆయనకు గౌరవ సూచకంగా వారి జన్మదినాన్ని(జనవరి 12) జాతీయ యువజన దినోత్సవం గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ గారు వివేకానందుని బోధనలు స్పూర్తిగా తీసుకొని నిరంతరం యువతను ప్రోత్సాహించి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వివేకానందుని ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శులు కొలుపుల శంకర్,రచ్చ కుమార్, జిల్లా, మండల, శక్తి కేంద్రం ఇంచార్జీలు మరియు వివిధ మోర్చాల బాధ్యులు బూత్ కమిటీ అధ్యక్షులు పైండ్ల రాజేష్, మంగళపళ్ళి యాకయ్య, గడల శేఖర్, గట్ల భరత్,చెన్నోజు విజయ్ కుమార్, నడిగడ్డ సందీప్, గంధం రాజు, కుమ్మరికుంట్ల శివ, తాటి జగదీష్,ధరావత్ తేజస్,సిహెచ్.శ్రీనివాస్, శివ గణేష్, నిమ్మల సంపత్, కక్కెర్ల సురేష్, శివసాయి,తదితరులు పాల్గొన్నారు.