
యువత పోరుపోస్టర్ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నాయకులు
పయనించే సూర్యుడు మార్చి 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై నిరసన గళం తెలిపేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న జిల్లా కేంద్రమైన నెల్లూరులో నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు,యువత నాయకులు, విద్యార్థి నాయకులతో కలసి యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలసి ఈ నెల 12న జరిగే యువత పోరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థులు,తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలసి అన్ని కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీ వెళ్లి కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం చేయడంజరుగుతుందని వివరించారు. త్రైమాసికాలుగా ఫీజు రీయంబర్స్ మెంట్, వసతి దీవెనద ఇవ్వాల్సిన రూ.4600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలని, కొత్త మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ప్రయత్నాలను పసహకరించాలని అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను బయటపెడుతూ యువత పోరును విజయవంతం చేద్దామనిపిలుపునిచ్చారుకాశీనాయన ఆశ్రమ కూల్చివేత తగదు. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అవధూత కాశీనాయన సత్రంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతుంటాయని, అలాంటి ఆశ్రమాన్ని కూల్చేవేసే చర్యలు కూటమి ప్రభుత్వానికి తగదని నాయకులు పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడి డిప్యూటి సీయం పవన్ కళ్యాణ తమ శాఖ పరిధిలోనే ఈ ఆశ్రమ కూల్చి వేతలు జరుగుతున్న విషయం గురించి తక్షణమే జోక్యం తీసుకుని నిలుపుదల చేయాలని, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం ఈ విషయమై చొరవ చూపాలని అన్నారు.గత 30 సంవత్సరాల నుండి ఎంతో మంది అన్నార్తులకు అన్నం పెట్టే కాశీనాయన ఆశ్రమాలనుకూల్చివేయడం మహాపాపమని, అందరికి అన్నంపెట్టే ఇలాంటి ఆశ్రమాలు కూల్చివేయడం తగదని, వెంటనే ఈకూల్చివేతలను నిలుపుదల చేయాలని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆండ్రా సుబ్బారెడ్డి, ముతీవర్, తోడేటి మణి, కలాం, ఖాదర్ మస్తాన్, కొప్పోలు వెంకటేశ్వర్లు, పాలేటి వెంగళరెడ్డి, యువత నాయకులు నాగా సుబ్రమణ్యం రెడ్డి, గోవర్థన్, అధిక సంఖ్యలో యువత, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.