రజక సంఘం ఆద్వర్యంలో శంకరపట్నంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దగ్ధం
పయనించే సూర్యుడు జనవరి 10 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : 24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను శంకరపట్నం మండల రజక సంఘం అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులను కించపరిచేలా టీవీ డిబేట్లో మాట్లాడిన చిట్టిబాబును వెంటనే అరెస్టు చేయాలని రజక జాతికి చిట్టిబాబు వెంటనే భహిరంగ క్షమాపణ చెప్పాలని, అలగే 24/7 న్యూస్ చానెల్ కూడా దీనికి భాద్యత వహించి వారి చానెల్లో చిట్టి బాబుతో క్షమాపణలు చెప్పించాలని లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అవసరమైతే చిట్టిబాబు పై భౌతిక దాడులు చేసేందుకు కూడా వెనకాడేది లేదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ నాంపల్లి శంకరయ్య మండల ప్రధాన కార్యదర్శి కల్లెపెళ్లి క్రాంతికుమార్, కోశాధికారి రాసమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కల్లెపెల్లి కిరణ్, రాసమల్ల ఎల్లయ్య, ప్రచార కార్యదర్శి నేరేళ్ల సంతోష్, నాంపల్లి వెంకటేష్, చిర్ర సంపత్, నాయకులు కల్లెపెల్లి కనకయ్య, రాసమల్ల సమ్మయ్య, రాచర్ల వెంకటేశం, మునిగంటి ఐలయ్య, ముప్పు కూమార్, పాండ్రాల మహేష్, పావురాల రవి, నాంపెల్లి సతీష్, బిక్షపతి, అంజి తదితరులు పాల్గొన్నారు