
రుద్రూర్, జనవరి 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్), సిద్దాపూర్, బొప్పాపూర్ గ్రామాలల్లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ప్రజా పాలన గ్రామసభను నిర్వహించారు. కాగా అంబం(ఆర్) గ్రామంలో అసవత్తరంగా గ్రామసభ కొనసాగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలపై అర్హులైన వారి పేర్లను అధికారులు చదివి వినిపించారు. అయితే ఈ పథకాలలో అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు జాబితాలో వచ్చాయని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో గ్రామసభ రసవత్తరంగా సాగింది. అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతూ.. జాబితాలో పేర్లు రాని వారు నిరాశ చెందవద్దని, ఈ పథకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ గ్రామ సభలో ఆర్ ఐ భారతి, ప్రత్యేకాధికారి సంతోష్, ఏఓ సాయి కృష్ణ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.