
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సహకారంతో చైర్మన్ గా ఎన్నిక
పయనించే సూర్యుడు న్యూస్ 20 సెప్టెంబర్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ రాచకొండ మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా దళిత మహిళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాచకొండ మైలారం నూతన చైర్మన్ గా దండుమైలారం గ్రామానికి చెందిన దళిత మహిళ మంచాల అంజమ్మ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించానాన్ని తెలిపారు.నాపై నమ్మకంతో పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు పొందినదుకు నమ్మకాని వమ్ము చేయకుండా రైతుల సమస్యలను పరిష్కరించడం లో ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.