
పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వానికి నిబద్ధుడనై పనిచేస్తా – దరువు అంజన్న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు అంజన్న ను సాంస్కృతిక శాఖ సలహాదారునిగా నియమించడం పట్ల పలు ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి, ఈ సందర్భంగా దరువు అంజన్నను శాలువాతో సత్కరించి ఆయన చేసిన సేవలను మునుముందు చేయబోయే సేవలను గుర్తు చేశారు, గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యమకారులను ప్రజా కళాకారులను గుర్తించడం హర్షించదగ్గ విషయమని అన్నారు, జగద్గిరిగుట్టలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో, జగద్గిరిగుట్ట బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో జర్నలిస్ట్ ఎమ్మార్పీఎస్ సిపిఐ సంఘాల నాయకులు, గాజులరామారంలో విశ్వకర్మ విజ్ఞాన సమితి నాయకులు అంజన్నను సత్కరించారు,
వైద్యరత్న సత్యనారాయణ, హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ వ్యవస్థాపకులు విజయ్, సాజిద్ ఎన్ ఎస్ యూ ఐ నాయకులు సాయి పంతులు, నవీనాచార్యులు, శివాజీ, సెల్వరాజ్ శ్యామ్, జర్నలిస్ట్ నాయకులు డప్పు రామస్వామి, తొండ వెంకట్ బాలరాజు సాయిరాజ్ మల్లేష్ రమేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు దుర్గన్న, విశ్వకర్మ సేవా సంఘం నాయకులు బ్రహ్మానంద చారి,కృష్ణ చారి, కళాకారుడు తాండూర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
