
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు…
రుద్రూర్, మార్చ్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాంలు మాట్లాడుతూ.. శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కేటీఆర్ లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నిందలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్వతి ప్రవీణ్, షేక్ నిస్సార్, కర్క అశోక్, అడప సాయిలు, పత్తి రాము, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, కుర్మాజి సాయిలు, చిక్కడపల్లి రవి, సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.