
రుద్రూర్ మసీద్ లో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్స్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని జామా మసీద్ లో శుక్రవారం ముస్లింలు శాంతియుత నిరసనలు తెలిపారు. నమాజు తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత పద్ధతులలో నిరసన తెలియజేస్తూ మస్జీద్ వద్ద వక్స్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జామా మసీద్ సదర్ జహుర్, షేక్ నిస్సార్ లు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ బిల్లు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు వక్స్ బోర్డు స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్స్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తుందని అన్నారు. ఈ నిర్ణయా పునఃపరిశీలించి బిల్లుని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ సదర్ జహుర్ సాబ్, మజీద్ సదర్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖద్రి, మోమినాన్ మజీద్ సదర్ మొహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ యూనూస్, తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్ మొహమ్మద్, జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తానీ, ఖాజామియా, తురబ్ సాబ్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ హుసేని, అఫ్రోజ్ పటేల్, షేక్ హాజీ తదితరులు పాల్గొన్నారు.
