
//పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మార్చ్ 7 తేదీ
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకులో రెండు లక్షల పైన అప్పు ఉన్న రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలనీ జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం పెట్టుబడులు ,కూలీల రెట్లు ఎక్కువగా అయినందున పంటల ద్వారా వచ్చిన డబ్బులు అసలుకే సరిపోలేదని తెలిపారు.పెట్టుబడుల కోసం ప్రయివేటు అప్పు చేయడం వలన వడ్డీలు కట్టలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ కాక రైతులు ఆర్థిక గా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు.