
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య.
యాలం నర్సింహరావు మృతి చాలా బాధాకరం రైతు కుటుంబని అండగా ఉంటా .
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 17: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన రైతు యాలం నర్సింహరావు ఆత్మహత్యకు పాల్పడగా, బుధవారం సాయంత్రంభద్రాచలం మాజీ శాసన సభ్యులు, టిపిసిసి ఉపాధ్యక్షులు, తెలంగాణ అటవీ శాఖ డెవలప్మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10 వేల రూపాయిల ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ యాలం నరసింహరావు కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో వారి బంధువులు కుడుముల లక్ష్మినారాయణ, తాటి కృష్ణ, నర్సింహులు, కొమరం రాంమూర్తి , చిట్టీమల్ల సమ్మయ్య, ముకుందం, పూజారి శ్రీనివాస్,అమిలి చంద్రం, గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నరు.
