
ఉమ్మడి మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూలై 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ చౌరస్తాలో ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు అమూల్యమైన ప్రాణాలను కబళించింది. ఈ సంఘటన తీవ్రంగా కలిచి వేసిందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి విచారం వ్యక్తం చెశారు .ఎంతో భవిశ్యత్తు ఉన్న విద్యార్థిని ,మరియు తండ్రి మరణం ఆ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు .
రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందడం బాధాకరం కూతురుని కళాశాలకు పంపేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ తరహా ఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోవద్దని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతి చెందిన తండ్రి,కూతురు ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రహదారులు గుంతల మయంగా మారాయి, ప్రజలు ,విద్యార్థులు అత్యవసరమైతేనే బయటికి రావాలి ,వాహనాలు నెమ్మదిగా నడపాలని సుచించారు .మృతి చెందిన తండ్రి,కూతురు ల ఆత్మకు శాంతి చేకూరాలని ,ఆ కుటుంబానికి దేవుడు మనోదైర్యాని ఇవ్వాలనీ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.