
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ ఎం కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపే ట్ మెయిన్ రోడ్, ఓల్డ్ ముంబాయి హైవే సర్వీస్ రోడ్డు వద్ద జరుగుతున్న వాటర్ మెయిన్ లైన్ లీకేజీ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి ట్రాన్స్మిషన్ అధికా రులతో కలసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, మెయిన్ రోడ్ సర్వీస్ లైన్ వద్ద జరుగుతున్న వాటర్ మెయిన్ లైన్ లీకేజీ పనులను హెచ్ ఎండ బ్ల్యూఎస్ఎస్బి ట్రాన్స్మిషన్ అధికారులతో కలసి పరిశీలించడం జరిగింది అని, ప్రస్తు తం కురుస్తున్న భారీ వర్షాలకు ఒక వారం రోజుల నుండి లైన్ మరమత్తులు జరప లేకపోయారని, ఇప్పుడు అత్యవసరంగా లీకేజీ పనులు చేపట్టామని చెప్పడం జరి గింది, అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అదేవిధంగా ప్రజలు అందరూ కలిసి డివిజన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, డివిజన్ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవం తమైన డివిజన్గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగ తిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సంద ర్బంగా కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు పేర్కొ న్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ట్రాన్సిషన్ ఏఈ వివేక్,వర్క్ ఇన్స్పెక్టర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.