
బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలిస్తున్న అధికారులు..
రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద లో లెవల్ బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో భారీ కెట్లు ఏర్పాటు చేసి రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. లోలెవల్ బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వర్షపు నీటి ఉద్రిక్తతను శనివారం తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీంరావు, ఎస్సై సాయన్న, ఇరిగేషన్ ఏఈ శృతి, పంచాయతీ రాజ్ ఏఈ పవన్, పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్ లు పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఉండాలని సూచించారు.