
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 21
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వరదలు తమ గ్రామాలను, ఇళ్లను మంచివేయక ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, రిహాబిటేషన్ సెంటర్లకు తరలి వెళ్లాలని ఎస్పీ అమిత బర్గర్ ముంపు ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. చింతూరు, విఆర్ పురం, కూనవరం లలో ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. అధికారులను ఏ ఏ గ్రామాలు ముందుగా ముంపు గురైతాయో తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రిహాబిటేషన్ సెంటర్ లకు ముందే ప్రజలను తరలించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాణహాని జరక్కుండా చూడాలని అధికారులను కోరారు. అలాగే బాధిత ప్రజలకు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నది ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్ ను అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం చింతూరు లోని ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోలింగ్ రూమ్ ను సందర్శించారు . పనిచేస్తున్న సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభమ్ అనోర్, ఓ ఎస్ డి జగదీష్ హడహళ్లి, అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, నాలుగు మండలాల రెవెన్యూ ఆఫీసర్లు, ఎండిఓలు చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎటపాక సీఐ కన్నపరాజు, నాలుగు మండలాల ఎస్సైలు అధికారులు పాల్గొన్నారు