
షాద్ నగర్ పదవ తరగతి ఫలితాల్లో విజయదుందుబి
విద్యార్థి ఆయేషా భానుకు 578/600
ఐశ్వర్యకు 573/ 600, శ్రావణికి 573/ 600
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో షాద్ నగర్ పట్టణంలోని కాకతీయ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ సంస్థ దూసుకుపోతుంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో షాద్ నగర్ పట్టణంలో నాలుగో స్థానంలో నిలదొక్కుకున్నారు. పాఠశాల చెందిన ముగ్గురు విద్యార్థినిలు మంచి మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని కాకతీయ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్ సంయుక్త, పాఠశాల డైరెక్టర్ వంశీకృష్ణ ,బాల త్రిపుర సుందరి తెలిపారు.
విద్యార్థి ఆయేషా భానుకు 578/600, ఐశ్వర్యకు 573/ 600, శ్రావణికి 573/ 600 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని వారు పేర్కొన్నారు.
షాద్ నగర్ పట్టణంలో వరుస విజయాలతో దూసుకుపోతూ నంబర్ వన్ గా నిలిచినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు శుభాభినందనలు తెలిపారు..